ఈ జగత్తులో
ప్రతిక్షనము విచిత్రమే
ఓ క్షణం ఆనంద డోలికల్లో ఉరేగిస్తుంది
మరోక్షణం విషాద సంద్రం లో ముంచేస్తుంది
ఆయినా ,
జీవితం క్షణ భంగురమే
మరి ఎందుకీ ఆరాటం ?
మనుగడ కోసం పోరాటం ?
మేధస్సుకు పదును పెట్టి
రోదసి లోకడుగుపెట్టి
పరిసరాలపై విజయం
మెథొ పరినితికే నిదర్శనమా ?
ఉగ్రవాదం, అగ్రవాదం
మానవియతను మంటగలుపుతూ ఉంటే
బ్రతుకు నావ చిధ్రమవదా ?
చేపలా ఈది ,
పక్షి లా ఎగిరిన మనిషి
మనిషిలా బ్రతకడం మరిస్తే
ఆభివృద్దేనా ?
మానవత్వం పరిమళించి
మనీశిలా జీవిస్తూ
వసుదైక కుటుంబం అనుకుంటే
సార్థకమవదా జీవనం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి