19, డిసెంబర్ 2008, శుక్రవారం

నా ఆశ

కృష్ణ శాస్త్రిలా ఆథ్మశ్రయమూ
శ్రీ శ్రీ లా విప్లవత్మికమూ
తిలక్ లా రెంటి సంమిలితము
రాయలేను.
అయినా రాయాలన్న ఆశ
కపిత్వం అని వెక్కిరించినా
కాస్త రంగరించిన పైత్యం అని
సంశయించినా
నేను రాస్తూనే ఉంటా
ఆలోచనల్ని కదిలించేలా
మదిని మురిపించేలా
న చిరు ప్రయత్నం
కొనసాగుతూ . . . నే ఉంటుంది
నా కవిత
జాతిని జాగృతం చేసేవరకు
జగతిన చైతన్య దీప్తి గా
ప్రసరించే వరకు
అసిధార వ్రతం లా
నా పద పరంపర కొనసాగుతూ ............... నే ఉంటుంది.
గత కాలపు వైభవాలు కథలనే మిగిలినా
గత చరిత్ర ప్రభావాలు కలలానే కరిగినా

కథలెన్ని మారినా
వ్యధ ఎంతా మిగిలనా
కర్తవ్యం విడనాడకు

అస్తమయలేన్ని ఉన్నా
భానుడు పునరుధయించాడ
వెలుగులు పంచడా.