కృష్ణ శాస్త్రిలా ఆథ్మశ్రయమూ
శ్రీ శ్రీ లా విప్లవత్మికమూ
తిలక్ లా రెంటి సంమిలితము
రాయలేను.
అయినా రాయాలన్న ఆశ
కపిత్వం అని వెక్కిరించినా
కాస్త రంగరించిన పైత్యం అని
సంశయించినా
నేను రాస్తూనే ఉంటా
ఆలోచనల్ని కదిలించేలా
మదిని మురిపించేలా
న చిరు ప్రయత్నం
కొనసాగుతూ . . . నే ఉంటుంది
నా కవిత
జాతిని జాగృతం చేసేవరకు
జగతిన చైతన్య దీప్తి గా
ప్రసరించే వరకు
అసిధార వ్రతం లా
నా పద పరంపర కొనసాగుతూ ............... నే ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి