19, డిసెంబర్ 2008, శుక్రవారం

నా ఆశ

కృష్ణ శాస్త్రిలా ఆథ్మశ్రయమూ
శ్రీ శ్రీ లా విప్లవత్మికమూ
తిలక్ లా రెంటి సంమిలితము
రాయలేను.
అయినా రాయాలన్న ఆశ
కపిత్వం అని వెక్కిరించినా
కాస్త రంగరించిన పైత్యం అని
సంశయించినా
నేను రాస్తూనే ఉంటా
ఆలోచనల్ని కదిలించేలా
మదిని మురిపించేలా
న చిరు ప్రయత్నం
కొనసాగుతూ . . . నే ఉంటుంది
నా కవిత
జాతిని జాగృతం చేసేవరకు
జగతిన చైతన్య దీప్తి గా
ప్రసరించే వరకు
అసిధార వ్రతం లా
నా పద పరంపర కొనసాగుతూ ............... నే ఉంటుంది.
గత కాలపు వైభవాలు కథలనే మిగిలినా
గత చరిత్ర ప్రభావాలు కలలానే కరిగినా

కథలెన్ని మారినా
వ్యధ ఎంతా మిగిలనా
కర్తవ్యం విడనాడకు

అస్తమయలేన్ని ఉన్నా
భానుడు పునరుధయించాడ
వెలుగులు పంచడా.

28, నవంబర్ 2008, శుక్రవారం

మృత్యు గీతం

భిన్నత్వం లో ఏకత్వం
ఏకత్వం లో భిన్నత్వం
వెరసి ముంబైనగరం
నేడు ముష్కరుల చేతిలో
భయవిలహై వనుకుతుంది
మృత్యు కరాళ నృత్యపు
కాళ్ళకింద నలుగుతుంది
ఏమయింది నాటి
ఆడంబర ఆనందపు మొంబాయి
చేవచచ్చిన రాజకీయ క్రీడలో
బ్రతుకు చిధ్రమై మృత్యు గీతం పలుకుతోంది

27, నవంబర్ 2008, గురువారం

కమ్మని కల

ఒక రాత్రి
నిశీది నింగిన నక్షత్రాలు మెరుస్తున్న వేళ
మెరిసే ఓ దివ్యా౦గన భువి చేరింది
సుగంధ పవనాలు విస్తుండగా
గలికేగిరే తన ముంగిరులతో
తన నాట్యం తో నన్నలరించింది
మధుర గానంతో నను మైమరిపింప చేసింది
తన బిగి కౌగిట అలసి సోలసేడి వేళ
అలారం మోతలో కల కరిగి పోయింది.

26, నవంబర్ 2008, బుధవారం

సినిమా vs పుస్తకం

సినిమా
ఓ ఫాస్ట్ ఫుడ్
ఆస్వాధించేలోగా ఆనందం ఆవిరవుతుంది
పుస్తకం
ఓ స్వయంపాకం
వండుకున్నవాడికి వన్దుకున్నన్త.
నిశ్శబ్ధం
నీకు నాకు మద్య కాని
నీ గుండె చప్పుళ్ళు
శ్రావ్యమైన సంగీతంలా
వినిపిస్తుంటే
గుండెకోసిన నిశ్శబ్దం
నిస్సత్తువగా మారి
నానుండి పారిపోయింది .

మానవీయత

ఈ జగత్తులో
ప్రతిక్షనము విచిత్రమే
ఓ క్షణం ఆనంద డోలికల్లో ఉరేగిస్తుంది
మరోక్షణం విషాద సంద్రం లో ముంచేస్తుంది

ఆయినా ,

జీవితం క్షణ భంగురమే
మరి ఎందుకీ ఆరాటం ?
మనుగడ కోసం పోరాటం ?

మేధస్సుకు పదును పెట్టి
రోదసి లోకడుగుపెట్టి
పరిసరాలపై విజయం
మెథొ పరినితికే నిదర్శనమా ?

ఉగ్రవాదం, అగ్రవాదం
మానవియతను మంటగలుపుతూ ఉంటే
బ్రతుకు నావ చిధ్రమవదా ?

చేపలా ఈది ,
పక్షి లా ఎగిరిన మనిషి
మనిషిలా బ్రతకడం మరిస్తే
ఆభివృద్దేనా ?

మానవత్వం పరిమళించి
మనీశిలా జీవిస్తూ
వసుదైక కుటుంబం అనుకుంటే
సార్థకమవదా జీవనం.
నా మస్తిష్క సంద్రం లో ఏర్పడే ప్రశ్నకేరటాలకు
ఏమని జేవబివ్వను ?
ఆశల స్వప్న సౌదాలు నిర్మిస్తూ
ఉహా లోకాల ఉండిపోమ్మనా ?
లేక,
నీతో గడిపిన గతమంతా కమ్మనికలగా
మరిచిపోమ్మన ?
ప్రియ సఖీ,
నీదే ఇక తుది నిర్ణయం
నువ్ కాదంటే నా బ్రతుకంతా అయోమయం .
నిను చూడగానే నా మది పులకరిస్తుంది
తొలకరి జల్లు కురిసిన పుడమి తల్లిలా
నీ అందేలా మువ్వల సవ్వడి వినగానే
నా బాద కరిగింది వేడి తాకిన వెన్నముద్ధలా
నీ బిగి కౌగిట చేరగానే నా హృది నాట్యమాడింది
శ్రావణ మేఘాన్ని చూసిన మయూరం లా
అందుకే,
ఓ నా నెచ్చెలి

నేనేదురు చూస్తుంటాను నీకోసం
శశి రాక కోసం చూసే చేకోర పక్షిలా

premageetham

నీ కోసమే నేనున్నానంటూ గుండె చప్పుడై వినిపించింది
నీ వెంటే నేనున్ననాటు చిరుగాలై తను స్ప్రుశియించింది
ఆలోచనలో జీవం పోసుకు
అనురాగం తన రూపం చేసుకు
ఎదలో తనే కొలువయ్యింది
నవ ప్రేమగితం వినిపించింది